- India Languages
- Secondary School
Essay on television in telugu language
what are adventages of tv
New questions in India Languages
- Telugu News
తెలుగు భాషా దినోత్సవం ప్రత్యేకం... ప్రసూన బిళ్ళకంటి వ్యాసం
తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు.
నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూన బిళ్ళకంటి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
తెలుగే ఒక వెలుగు
జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా, ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.
ఇంగ్లాండు నుంచి వచ్చి, ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు?
భాష భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాలను అభివృద్ధి పరిచే సాంస్కృతిక ప్రతిబింబం. ఉగ్గుపాలతోపాటు మనోభావాలు మాటల్లో, పాటల్లో బిడ్డకు చేరుతాయి. 'చందమామ రావే.... జాబిల్లి రావే...' అనే పాటలో బిడ్డ ఎంత ఆనందం పొందుతుందో, సరస్వతీ దేవి కూడా అంతే పరవశమౌతుంది.
పరిణామ క్రమంలో ఎన్నో విషయాల్లో ఎన్నో మార్పులు జరిగుతాయి. అందుకు భాష కూడా అతీతం కాదు. ఆ మార్పు తెలుగులో ఎక్కువగా జరుగుతుంది అని చెప్పవచ్చు. పక్కన ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో మాతృ భాష పై మమకారం ఎక్కువ. ఇంకో భాషకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వరు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే దగ్గరుండి మాతృభాషకు ద్రోహం తలపెడుతున్నారు. దానికి మేధావులు వత్తాసు పలుకుతున్నారు.
తెలుగు వికాసంలో ఎవరెవరు ఎలా మార్పులు తీసుకొచ్చారు అన్నప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు సమాజంలో మార్పు తేవడానికి, గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎంత సేవ చేశారో, అధికార భాషను ప్రజల భాషగా మార్చడానికి గిడుగు రామమూర్తి పంతులు గారు అంత కృషి చేశారు. అందుకే తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు వారు మన కళ్ళముందు దర్శనమిస్తారు.
రాయప్రోలు, త్రిపురనేని, చిలకమర్తి, పానుగంటి, ఉన్నవ, విశ్వనాథ, శ్రీ శ్రీ, కాళోజీ, సినారె మొదలగు ఎందరో కవులు తెలుగు సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చినారు. సురవరం ప్రతాప రెడ్డి దినపత్రికలలో భాషా విప్లవానికి నాంది పలికారు. భక్తి మార్గంలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, రామదాసు, పుట్టపర్తి, దేవులపల్లి... ఇలా ఎందరో సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులైనారు.
ఈనాడు భారత దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. ప్రపంచంలో ఇది పదహారవ స్థానం ఆక్రమించింది. అతి సులభతరమైన ప్రపంచ భాషలలో మాండరిన్ తర్వాత తెలుగు రెండో స్థానంలో ఉంది. కానీ ఇపుడు ఆధునిక పరిణామ మార్పుల నేపథ్యంలో విపరీతంగా నిరాదరణకు గురవుతున్న భాషల్లో కూడా తెలుగు ముందంజలో ఉండడం చాలా బాధాకరం. ఒక భాషకు ప్రాధాన్యత తగ్గితే దాని చుట్టూ వేలాది సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెరమరుగవుతాయని గమనించాలి. వేరుకు చెదలు పడితే మహా వృక్షమైనా నేల కూలక తప్పదు. పరిస్థితి మన భాషకు రాకముందే మనం మేలుకోవడం మంచిది.
ఏ పని అయినా కలిసి కట్టుగా చేస్తే అందులో విజయం సాధించవచ్చు. అప్పట్లో గిడుగు రామమూర్తి ఒక్కరే ఛాందస భాషావాదులతో ఎదురీది నిలిచారు. ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది. పర భాషా వ్యామోహంలో పడి, తల్లి భాషను మాట్లాడడానికి సిగ్గు పడుతున్నారు. పాఠశాలల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ లు వేస్తున్నారు. దీనిని తల్లిదండ్రులు సమర్ధిస్తున్నారు. అమ్మను అమ్మా అని పిలవొద్దనే దౌర్భాగ్య విష సంస్కృతి వచ్చి చేరింది. వేరే భాషలెన్నైనా నేర్చుకోండి, మన భాషను వీడకండి, మరువకండి.
విదేశాలకెళ్ళిన వారు సైతం మాతృదేశాన్ని, భాషను, సంస్కృతులను పద్ధతులను పాటించడం చూడ ముచ్చటగా ఉంది. ఇక్కడున్న వాళ్ళేమో మాతృ భాషకు మరణ శాసనం రాస్తున్నారు. చదువులో అన్ని విషయాల మీద ఉన్న శ్రద్ధ తెలుగు పైన చూపడంలేదు. ఇది చాలా సిగ్గుచేటు. మలేషియా, సింగపూర్ లలో ఉండే తెలుగు వారు ఏటేటా తెలుగు దినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇక్కడున్నవారు తెలుగు తప్ప అన్నీ కావాలంటున్నారు.
ఎంత విజ్ఞానం పెరిగినా, ఆంగ్ల పదజాలం పెరిగినా, పెరిగిన సాంకేతిక నైపుణ్యం ద్వారా తెలుగులో కూడా ఆధునిక మార్పులు చేసి ఉపయోగించవచ్చు. ఆ రకంగా ప్రయత్నాలు చేయాలి. ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును చేయడం, తర్వాత ఐచ్ఛికం చేయడం వల్ల ముందు తరాలకు తెలుగును అందించవచ్చు. లేదంటే జీవద్భాష నుండి మృతభాషగా మారుతుంది. అందమైన అమ్మ భాషను కాపాడుకుందాం.
- Gidugu Ramamurthy
- Gidugu Venkata Ramamurthy
- Prasoona Billakanti
- Telugu Language Day 2021
Latest Videos
RELATED STORIES
తపనతో కథలు రాస్తున్నాను... ! 'సీతంబాయి పొలం' కథల సంపుటి ఆవిష్కరణలో అయోధ్యారెడ్డి
సాహితి కిరణం:ఉగాది కవితల పోటీ ఫలితాల విడుదల
నాగలి కూడా ఆయుధమే - సమీక్ష
ఈ. వెంకటేష్ కవిత : పంచభూతాలు
రేడియమ్ కవిత : ఆటమొదలు
Recent Stories
అమితాబ్ బచ్చన్ లవ్ స్టోరీలో చాలామందే ఉన్నారు
ఈ 5 మంది భారతీయుల కార్ల ధరలు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది
ఎన్టీఆర్ ను బురిడీ కొట్టించిన భానుమతి, ఆమె తెలివితేటలకు షాక్ అయిన పెద్దాయన, ఏం చేసిందంటే...?
ప్రపంచంలో టాప్-10 అతిపెద్ద కార్ల కంపెనీలు ఇవే
మరోసారి ప్లైట్ ఎక్కి చెక్కేసిన మహేష్ బాబు.. ఫారెన్ కు వెళ్తున్నావా.. పక్కూరికి వెళ్తున్నావా బ్రో
Recent Videos
మోహినీ అవతారంలో శ్రీనివాసుడు
టాప్-10 అందమైన మహిళా క్రికెటర్లు వీళ్లే
వైల్డ్ గా నామినేషన్లు.. యష్మి, సీత పని ఔట్ పృథ్వీకి పోటీగా గౌతమ్
సుహాస్, దిల్ రాజుతో సునీత స్పెషల్ ఇంటర్వ్యూ
మైసూరులో దసరా వేడుకలు కళ్లు చెదిరే డ్రోన్ షో
IMAGES
VIDEO
COMMENTS
టెలివిజన్ అనే పదమునకు మూలం లాటిన్, గ్రీకు పదాలు. "దూర దృష్టి" అనే అర్థం వచ్చే గ్రీకు పదం tele (గ్రీకు:τῆλε) అనగా దూరం,, లాటిన్ పదం visio అనగా దృష్టి అని అర్థము. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగే వింతల్ని, విశేషాల్ని మన కళ్ళ ఎదుట చూడాలనే తపన మానవుని హృదయాంతరాళాలలో ప్రాచీన కాలం నుండి మొదలవుతూనే ఉంది.
This video provides you an essay on Television in Telugu. This video is created especially for Telugu people.The content in the video can be easily understo...
The television comes with a big packet of entertainment programs for the audience. In other words, it presents such entertaining programs that the viewers are in a dilemma, who see and who leaves them.
semester 6semester – VI Television : https://youtu.be/Mln4ks0-xpgThe fringe benefits of failure and the importance of imagination : https://youtu.be/enDiKS...
నేడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు ఉపన్యాసకురాలు ప్రసూన బిళ్ళకంటి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి. తెలుగే ఒక వెలుగు. జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది.
తెలుగు వికీపీడియా (తెవికీ) 2003 డిసెంబరు 10 న ఆవిర్భవించిన తెలుగు భాషా వికీపీడియాలో ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని లిఖిత ఆధారాలతో ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. వెన్న నాగార్జున ప్రారంభ కృషి చేయగా, దీనిలో చాలామంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు.
This paper intends to find out the impact of reality shows in television channels on the youth. In this purpose four Telugu Television channels have been selected and youth of three areas of Visakhapatnam district in Andhra Pradesh state have been considered for data collection. These three areas are urban, semi-urban and rural.
essay on television. వినోదం మరియు కమ్యూనికేషన్ యొక్క అత్యంత ముఖ్యమైన ...
ఆయన జయంతినాడు (ఆగస్ట్ 29) మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవితకాలంలో...
Telugu literary Essays of criticism. vallampati venkatasubbaiah vimarsa, dalit shaityam, gorky mother, johnkavi poetry, what is the first telugu short story in...